GOVERNMENT OF INDIA
Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment
Screen Reader iconScreen Reader

National Space Day Quiz 2026 (Telugu)

Start Date : 23 Aug 2026, 9:00 am
End Date : 4 Oct 2026, 11:45 pm
Closed
Quiz Closed

About Quiz

మైగవ్ జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్ 2026తో మళ్లీ వచ్చేసింది!

హే, అంతరిక్ష ప్రియులారా! సిద్ధంగా ఉండండి!

భారతదేశ అంతరిక్ష యాత్ర కొత్త శిఖరాలను తాకుతోంది, మరియు అంతరిక్ష పరిశోధనలో భారతదేశ ప్రయాణాన్ని తీర్చిదిద్దిన అద్భుతమైన విజయాలు, మిషన్లు, మైలురాళ్లు మరియు ఆవిష్కరణల గురించి మీకు ఎంతవరకు తెలుసో పరీక్షించుకోవడానికి ఇది సమయం.

 జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా , భారతదేశాన్ని అంతరిక్షంలో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న జిజ్ఞాస, ఆవిష్కరణ మరియు అన్వేషణ స్ఫూర్తిని జరుపుకోవడానికి మరియు  జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్ 2026  లో పాల్గొనాల్సిందిగా  మైగవ్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది! 

మరి, మీ అంతరిక్ష పరిజ్ఞానానికి సవాల్ విసరడానికి సిద్ధంగా ఉన్నారా?

సిద్ధంగా ఉండండి, అంతరిక్ష ప్రియులారా! కౌంట్‌డౌన్ మొదలైంది!

 

రివార్డులు:

1వ బహుమతి: రూ. 1,00,000/-

2వ బహుమతి: రూ. 75,000/-

3వ బహుమతి: రూ. 50,000/-

తదుపరి 100 మంది విజేతలకు రూ. 2,000/- బహుమతిగా అందించబడుతుంది.

తదుపరి 200 మంది విజేతలకు రూ. 1,000/- బహుమతిగా అందించబడుతుంది.

ఈ క్విజ్‌లో టాప్ 100 మంది విజేతలు ISRO క్యాంపస్‌ను సందర్శించే అవకాశాన్ని కూడా పొందుతారు.

Terms and Conditions

1. ఈ క్విజ్‌లో భారతీయ పౌరులందరూ పాల్గొనవచ్చు. 

2. పాల్గొనేవారు ‘ప్లే క్విజ్’ పై క్లిక్ చేసిన వెంటనే క్విజ్ ప్రారంభమవుతుంది. 

3. 300 సెకన్లలోపు అన్ని సరైన సమాధానాలు ఇవ్వడమే ఈ క్విజ్ గెలుపు ప్రమాణం.

4. నిష్పాక్షికత, పారదర్శకతను నిర్ధారించేందుకు   సిస్టమ్ రూపొందించిన యాదృచ్ఛిక విధానం ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.  పేర్కొన్న క్విజ్ విజేతల ప్రమాణాలను, అంటే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడంతో పాటు, నిర్దేశిత సమయంలోపు క్విజ్‌ను సమర్పించిన పాల్గొనే వారందరినీ అర్హత పొందిన ఎంట్రీల కేంద్ర జాబితాలో చేర్చుతారు. విజేతలను కేవలం స్వయంచాలక యాదృచ్ఛిక ఎంపిక ప్రక్రియ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. .

5. తదుపరి సమాచారాన్ని పొందేందుకు పాల్గొనే వారు తమ మైగవ్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసి ఉంచాలి. అసంపూర్ణంగా ఉన్న ప్రొఫైల్ విజేతగా ఎంపికయ్యేందుకు అర్హత పొందదు.  

6. ప్రశ్నల సమితి స్వయంచాలక ప్రక్రియ ద్వారా ప్రశ్నల బ్యాంకు నుండి యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడుతుంది.

7. ప్రతి పాల్గొనేవారు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ID ద్వారా కేవలం ఒక్కసారి మాత్రమే క్విజ్ ఆడటానికి అనుమతించబడతారు. ఒకే మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID ని పాల్గొనడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు.

8. ఒక పాల్గొనేవారు మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID రెండింటినీ ఉపయోగించి క్విజ్ ఆడిన సందర్భాలలో, సమర్పించిన మొదటి ఎంట్రీని మాత్రమే చెల్లుబాటు అయ్యేదిగా మరియు విజేతల ఎంపిక ప్రక్రియకు అర్హమైనదిగా పరిగణిస్తారు.

9. చంద్రయాన్-3 క్విజ్ మరియు (గత సంవత్సరాల) జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్ యొక్క టాప్ 3 విజేతలు టాప్ 3 బహుమతులకు అర్హులు కారు. చంద్రయాన్-3 క్విజ్ మరియు (గత సంవత్సరాల) జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్‌లో విజేతలై ISROను సందర్శించిన వారు, జాతీయ అంతరిక్ష దినోత్సవ క్విజ్‌ 2026 కోసం ISRO సందర్శనకు అర్హులు కారు.

10. ఊహించని పరిణామాలు ఏవైనా ఎదురైతే, ఏ క్షణంలోనైనా క్విజ్‌ను సవరించడానికి లేదా నిలిపివేయడానికి మైగవ్ పూర్తి హక్కులను కలిగి ఉంది. సందేహాలను నివారించడానికి, ఈ నిబంధనలు మరియు షరతులను మార్చే వెసులుబాటు కూడా ఇందులో ఉంది.

11. క్విజ్‌కు ఏదైనా పాల్గొనేవారి భాగస్వామ్యం లేదా అనుబంధం ప్రతికూలంగా ఉందని మైగవ్ భావిస్తే, వారి పాల్గొనడాన్ని నిరాకరించే లేదా వారిని అనర్హులుగా ప్రకటించే పూర్తి హక్కు మైగవ్ కు ఉంటుంది. అందిన వివరాలు స్పష్టంగా లేకపోయినా, అసంపూర్తిగా ఉన్నా, పాడైపోయినా, అసత్యంగా లేదా తప్పుగా ఉన్నా ఆ భాగస్వామ్యం రద్దు చేయబడుతుంది. 

12. కంప్యూటర్ లోపం వల్ల లేదా నిర్వాహకుల నియంత్రణకు మించిన ఇతర కారణాల వల్ల కోల్పోయిన, ఆలస్యమైన, అసంపూర్ణమైన లేదా ప్రసారం కాని ఎంట్రీలకు మైగవ్ ఎలాంటి బాధ్యత వహించదు. ఎంట్రీని సమర్పించినట్లు రుజువు చూపడం అంటే అది అందినట్లు రుజువు కాదు, దయచేసి గమనించండి.

13. మైగవ్ ఉద్యోగులు లేదా క్విజ్ నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ఉద్యోగులు ఈ క్విజ్‌లో పాల్గొనేందుకు అర్హులు కారు. ఈ అనర్హత వారి సమీప కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది. 

14. క్విజ్‌కు సంబంధించి మైగవ్ తీసుకునే నిర్ణయమే అంతిమమైనది మరియు అందరికీ కట్టుబడి ఉంటుంది, దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు లేదా వాదనలు స్వీకరించబడవు.

15. అన్ని అప్‌డేట్ల కోసం పాల్గొనేవారు క్రమం తప్పకుండా కంటెంట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలి.

16. విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, పాల్గొనే వారు తమ పాల్గొనడాన్ని మరియు క్విజ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తింపుగా డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

17. క్విజ్‌లో పాల్గొనడం ద్వారా, క్విజ్ పోటీకి సంబంధించిన అన్ని నిబంధనలు మరియు షరతులతో పాటు, వాటిలో చేసే సవరణలు లేదా తదుపరి అప్‌డేట్‌లను కూడా పాల్గొనే వారు తప్పనిసరిగా పాటించాలి.

18.  అన్ని వివాదాలు/ న్యాయపరమైన ఫిర్యాదులు ఢిల్లీ న్యాయ పరిధికి మాత్రమే లోబడి ఉంటాయి. ఈ ప్రయోజనం కోసం అయ్యే ఖర్చులను ఆయా పార్టీలే భరిస్తాయి.

19. ఇక్కడి నుంచి ఈ నిబంధనలు మరియు షరతులు భారతీయ చట్టాలు మరియు భారతీయ న్యాయవ్యవస్థ తీర్పుల ద్వారా నియంత్రించబడతాయి.