GOVERNMENT OF INDIA
Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment
Screen Reader iconScreen Reader

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పై క్విజ్ (Puducherry, Telugu)

Start Date : 13 May 2022, 5:00 pm
End Date : 29 May 2022, 11:30 pm
Closed View Result
Quiz Closed

About Quiz

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) నేపథ్యంతో సబ్‌కా వికాస్ మహాక్విజ్ సిరీస్‌లో రెండవ క్విజ్‌ని ప్రారంభిస్తోంది.

 

పౌరులలో అవగాహన పెంపొందించే ప్రయత్నంలో భాగంగా MyGov India సబ్కా వికాస్ మహాక్విజ్ సిరీస్‌ను ప్రారంభించింది. ఈ క్విజ్ యొక్క లక్ష్యం భారత ప్రభుత్వం యొక్క వివిధ పథకాలు మరియు కార్యక్రమాల గురించి మరియు వాటి ప్రయోజనాలను ఎలా పొందాలి అని పాల్గోనేవారికి తెలియజేయడం.

 

ఈ సందర్భంలో, MyGov మీ అందరినీ క్విజ్ లో పాల్గొని, న్యూ ఇండియా గురించి మీ జ్ఞానాన్ని పరీక్షించుకోమని ఆహ్వానిస్తోంది. ఈ సిరీస్‌లోని రెండవ క్విజ్ ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) నేపథ్యంలో ఉంది

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) గురించి

 

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన భారతదేశంలోని ప్రతి భారతీయుడు తమ తలపై పక్కా పైకప్పు ఉండేలా చూడాలని ఒక స్పష్టమైన పిలుపు ఇచ్చారు. తదనుగుణంగా, దేశంలోని పేద మరియు బడుగు బలహీన ప్రజలకు పక్కా గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రారంభించబడింది. ఈ మిషన్ రెండు వేర్వేరు పథకాల ద్వారా అమలు చేయబడుతోంది – ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (PMAY-U) పట్టణ ప్రాంతాలకు మరియు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G), గ్రామీణ ప్రాంతాల కొరకు.

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ

 

2024 నాటికి తాత్కాలిక నివాసాలు మరియు శిథిలావస్థలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 2.95 కోట్ల గ్రామీణ ఇళ్లు లేని కుటుంబాలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన పక్కా గృహాన్ని అందించడం దీని లక్ష్యం. ఈ పథకం కింద ప్రజలకు వారి ఇళ్లను నిర్మించుకోవడానికి నగదు సహాయం అందించబడుతుంది.

 

మైదాన ప్రాంతాల్లోని వారికి రూ.1.2 లక్షలు; మరియు కొండ ప్రాంతాలు, కష్టతరమైన ప్రాంతాలు మరియు IAP (ఎంపిక చేయబడిన గిరిజన మరియు వెనుకబడిన జిల్లాల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక) జిల్లాలలో రూ. 1.3 లక్షలు ఇవ్వబడుతుంది అదనంగా, స్వచ్ఛ భారత్ మిషన్ – గ్రామీణ్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించడానికి రూ. 12,000 కూడా ఇవ్వబడుతుంది.

 

28 ఏప్రిల్ 2022 నాటికి, 2.34 కోట్ల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి మరియు 1.79 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయి, తద్వారా కోట్లాది మంది జీవితాలను మార్చబడ్డాయి మరియు వారికి సామాజిక, ఆర్థిక మరియు మానసిక భద్రతను కల్పించబడింది.

PMAY-Gని ఎలా పొందాలి?

 

ఇళ్లు లేని వారందరూ మరియు కొన్ని షరతులకు లోబడి SECC డేటా మరియు Awas+ సర్వే ప్రకారం తాత్కాలిక గోడలు మరియు పైకప్పు (తాత్కాలిక ఇళ్ళు) ఉన్న; సున్నా, ఒకటి లేదా రెండు గదులలో నివసిస్తున్న కుటుంబాలు PMAY-G పథకం కింద అర్హులైన లబ్ధిదారుల జాబితాలోకి వస్తారు. వీరు సామాజిక-ఆర్థిక & కుల గణన (SECC 2011) వంటి జాతీయ, రాష్ట్ర మరియు గ్రామ పంచాయతీ స్థాయి సర్వేల సహాయంతో తయారు చేసిన జాబితా ద్వారా వారు గుర్తించబడతారు . ఈ జాబితా, ఇళ్లు లేని నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తుంది మరియు ఈ జాబితా నుండి మినహాయించబడిన లబ్ధిదారులు పరిష్కారం కోసం స్థానిక కార్యాలయాలను కూడా సంప్రదించవచ్చు.

 

జాబితా తయారైన తర్వాత, లబ్ధిదారుడి పేరు మీద మంజూరు ఉత్తర్వు జారీ చేయబడుతుంది. లబ్దిదారునికి అనుకూలంగా మంజూరైన విషయం కూడా లబ్దిదారునికి SMS ద్వారా తెలియజేయబడుతుంది. లబ్ధిదారుడు బ్లాక్ ఆఫీస్ నుండి మంజూరు ఉత్తర్వుని సేకరించవచ్చు లేదా అతని PMAY-G IDని ఉపయోగించి PMAY-G వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మంజూరు ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి ఒక వారం (7 పని దినాలు) లోపు లబ్ధిదారుని యొక్క నమోదు చేయబడిన బ్యాంక్ ఖాతాకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో మొదటి విడత సొమ్ము విడుదల చేయబడుతుంది.

 

ఏవైనా ఫిర్యాదుల కోసం, మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర శాఖలో సంబందిత వ్యక్తులను సంప్రదించవచ్చు మరియు వారి వివరాలు https://pmayg.nic.in/netiay/contact.aspx వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ – ఆవాస్ యాప్‌లో మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం www.pmayg.nic.in పోర్టల్ కూడా సిద్ధం చేయబడింది

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్

 

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్‌ను జూన్ 2015లో పట్టణాలలో అర్హులైన లబ్ధిదారుల కుటుంబాలకు ‘పక్కా ఇల్లు’ అందించడం ద్వారా ‘అందరికీ ఇళ్లు’ అనే దృక్పథాన్ని నెరవేర్చడం కోసం ప్రారంభించారు. ఈ మిషన్ కింద, మురికివాడల నివాసితులు మరియు ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), దిగువ ఆదాయ సమూహం (LIG) మరియు మధ్య-ఆదాయ సమూహం (MIG) వర్గాలకు చెందిన పౌరుల గృహ అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర సహాయం అందించబడింది.

పట్టా భూమి ఉన్న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తారు మరియు సొంత భూమి లేని వారు నిర్మించబడిన ఇళ్లకు అర్హులు. ఈ పథకాలు సొంత పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి, మరుగుదొడ్లు, వంటగది, నీరు మరియు విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక సేవలను సమకూర్చుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం, మరియు మహిళా సాధికారత కల్పించడం కోసం మహిళా సభ్యులకు అనుకూలంగా లేదా ఉమ్మడి పేరుతో యాజమాన్య హక్కులను కల్పించడం వంటి బహుళ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

 

దాదాపు 1.2 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే, 2022 మార్చి నాటికి 58 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.

 

PMAY-U ని ఎలా పొందాలి?

 

ప్రయోజనాలను పొందాలనుకునే లబ్ధిదారులు వారి సంబంధిత ప్రాంతంలోని పట్టణ స్థానిక సంస్థలను సంప్రదించాలి. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS) కింద ప్రయోజనాల కోసం, గృహ రుణంపై వడ్డీ రాయితీని క్లెయిమ్ చేయడానికి లబ్ధిదారులు నేరుగా బ్యాంక్/హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవాలి.

 

హెల్ప్‌లైన్ నంబర్లు 011-23063285 మరియు 011-23060484 ఏర్పాటు చేయబడ్డాయి. భువన్ యాప్, భారత్ హెచ్‌ఎఫ్‌ఎ యాప్, జిహెచ్‌టిసి ఇండియా యాప్ మరియు పిఎంఎవై (అర్బన్) యాప్ ఉపయోగపడే మొబైల్ యాప్‌లు. రెండు పోర్టల్‌లు https://pmay-urban.gov.in మరియు https://pmaymis.gov.in ఏర్పాటు చేయబడ్డాయి.

 

మహాక్విజ్ యొక్క ప్రత్యేక లక్షణాలు

 

MyGov సాథీస్/యూజర్‌లు తమకు నచ్చిన ఏదైనా రాష్ట్రం యొక్క వెర్షన్‌ను ఎంపిక చేసుకుని క్విజ్ ఆడవచ్చును. క్విజ్ ప్రశ్నలు ఇప్పుడు పథకం మరియు నిర్దిష్ట రాష్ట్రానికి సంబంధించినవిగా ఉంటాయి. క్విజ్ ఇంగ్లీష్, హిందీ మరియు ప్రాంతీయ భాషలతో సహా బహుళ భాషలలో అందుబాటులో ఉంటుంది.

Terms and Conditions

1. ఈ క్విజ్ సబ్కా వికాస్ మహాక్విజ్ సిరీస్లో ఒక భాగం, దీనిలో వివిధ నేపథ్యాలపై విభిన్న క్విజ్లు ప్రారంభించబడతాయి.

2. క్విజ్ 13 మే , 2022 నాడు ప్రారంభించబడుతుంది మరియు 27 మే , 2022 రాత్రి 11:30 (IST) వరకు అందుబాటులో ఉంటుంది.

3. క్విజ్ లోకి ప్రవేశానికి భారతదేశ పౌరులందరు అర్హులే

4. ఇది ఒక సమయావధి ఉన్నక్విజ్, 5 ప్రశ్నలకు 100 క్షణాలలో సమాధానాలు చెప్పాలి ఇది బహుళ భాషల్లో లభ్యం అయ్యే స్టేట్ స్పెసిఫిక్ క్విజ్. ఒక వ్యక్తి బహుళ క్విజ్ ల్లో పాల్గొనవచ్చు.

5. క్విజ్ ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం మరియు తెలుగు మొదలగు 12 భాషలలొ అందుబాటులో ఉంటుంది

6. ప్రతి క్విజ్ కు గరిష్టంగా 1,000 మంది టాప్ స్కోరింగ్ పార్టిసిపెంట్స్ విజేతలుగా ఎంపిక చేయబడతారు. ఎంపిక చేయబడ్డ విజేతల్లో ప్రతి ఒక్కరికీ రూ 2,000/-ఇవ్వబడుతుంది.

7. అత్యధిక సంఖ్యలో సరైన సమాధానాలు ఇచ్చిన వారి ఆధారంగా విజేతలు ఎంపిక చేయబడతారు. ఒకవేళ అత్యధిక మార్కులు సాధించిన పాల్గొనేవారి సంఖ్య 1,000 దాటితే, క్విజ్‌ని పూర్తి చేయడానికి పట్టిన సమయం ఆధారంగా మిగిలిన విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఉదాహరణకి, ఒకవేళ క్విజ్ ఫలితాలు క్రింది విధంగా ఉంటే

పోటీదారుల  సంఖ్య

స్కోరు

హోదా

500

20 కి 20

వీరు విజేతలుగా ప్రకటించబడతారు. వీరు రూ. 2,000 నగదు బహుమతి పొందుతారు

400

19 కి 20

వీరు విజేతలుగా ప్రకటించబడతారు  వీరు రూ. 2,000 నగదు బహుమతి పొందుతారు

400

18 కి 20

విజేతలు ఇప్పుడు 1000 దాటినందున, కేవలం 100 మంది మాత్రమే నగదు బహుమతికి.అర్హులు. దీని ప్రకారం, సమాధానాలు ఇవ్వడానికి అతి తక్కువ సమయం తీసుకున్న వారి ఆధారంగా 100 మంది ఎంపిక చేయబడతారు. ఈ 100 మందికి రూ. 2,000 నగదు బహుమతి లభిస్తుంది.

8. పోటీదారులు నిర్దిష్ట క్విజ్ లో ఒక్కసారి గెలవడానికి మాత్రమే అర్హులు. ఒకే క్విజ్‌లో ఒకే ప్రవేశకుడి నుండి బహుళ ఎంట్రీలు బహుళ విజయాలకు అర్హత పొందవు. అయితే, పాల్గొనేవారు మహావికాస్ క్విజ్ సిరీస్‌లోని వేరే క్విజ్‌లను గెలవడానికి అర్హత కలిగి ఉంటారు.

9. మీరు మీ పేరు, ఈమెయిల్ చిరునామా, టెలిఫోన్ నంబరు మరియు పోస్టల్ చిరునామా అందించాలి. మీ సంప్రదింపు వివరాలను సమర్పించడం ద్వారా, క్విజ్ యొక్క ప్రయోజనం కోసం వాడబడే ప్రచార సమాచారమును స్వీకరించడం కోసం ఉపయోగించబడే వివరాలకు మీరు సమ్మతి ఇస్తారు.

10. ప్రకటించబడిన విజేతలు బహుమతి సొమ్ము అందుకొనుటకు వారి బ్యాంక్ వివరాలు షేర్ చేయవలసి ఉంటుంది. బహుమతి సొమ్ము అందుకోవాలంటే యూజర్ నేమ్ మరియు బ్యాంక్ ఖాతాపై పేరు ఒక్కటే అయి ఉండాలి

11. ఆటోమేటెడ్ ప్రాసెస్ ద్వారా ప్రశ్నావళి నుండి  ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడతాయి

12.మీరు ఒక కఠినమైన ప్రశ్నను దాటవేసి దానిని తరువాత ప్రయత్నించవచ్చు

13. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు

14. పార్టిసిపెంట్ స్టార్ట్ క్విజ్ బటన్ పై క్లిక్ చేసిన వెంటనే క్విజ్ ప్రారంభం అవుతుంది.

15. సబ్మిట్ చేయబడిన తరువాత ఎంట్రీ ఉపసంహరించబడదు

16. ఒకవేళ పోటీదారుడు  క్విజ్‌ను సహేతుకమైన సమయంలో పూర్తి చేయడానికి అన్యాయమైన మార్గాలను ఉపయోగించినట్లు గుర్తించబడినట్లయితే, ప్రవేశం తిరస్కరించబడుతుంది

17. పోయిన, ఆలస్యంగా అందిన లేదా అసంపూర్ణంగా ఉన్న ఎంట్రీలకు లేదా కంప్యూటర్ పొరపాటు వలన లేదా నిర్వాహకుల సముచిత నియంత్రణ పరిధిలోలేని ఇతర పొరపాటు వలన కాని పంపించబడని ఎంట్రీలకు నిర్వాహకులు ఎలాంటి బాధ్యత తీసుకోరు. ఎంట్రీ సబ్మిట్ చేసిన రుజువు దాని స్వీకరణ కొరకు రుజువు కాదని దయచేసి గమనించండి

18. అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు, నిర్వాహకులు క్విజ్ ను సవరించుటకు లేదా ఉపసంహరించుటకు హక్కు కలిగి ఉంటారు. సందేహ నివృత్తి కొరకు ఇందులో నియమాలు మరియు నిబంధనలను సవరించే హక్కు ఉంది

19. ఎప్పటికప్పుడు క్విజ్ లో పాల్గొనేందుకు ఉన్న నియమాలు మరియు నియంత్రణలకు పాల్గొనేవారు కట్టుబడి ఉంటారు

20. ఒకవేళ క్విజ్ లో పాల్గొనే అభ్యర్ధి యొక్క భాగస్వామ్యము క్విజ్ కు ఏదా క్విజ్ యొక్కనిర్వాహకులు లేదా భాగస్వాములకు హానికరము అని భావిస్తే నిర్వాహకులు అభ్యర్ధి క్విజ్ లో పాల్గొనడానికి అనర్హులని తెలుపుటకు లేదా వారిని పాల్గొనకుండా తిరస్కరించుటకు అన్ని హక్కులు కలిగి ఉంటాయి. ఒకవేళ నిర్వాహకులు అందుకున్న సమాచారము అస్పష్టంగా, అసంపూర్ణంగా, పాడైపోయి, అసత్యముగా లేదా తప్పులు కలిగి ఉంటే రిజిస్ట్రేషన్లు చెల్లవు.

21. MyGov ఉద్యోగులు మరియు వారి బంధువులు క్విజ్ లో పాల్గొనకూడదు

22. క్విజ్ పై నిర్వాహకుల నిర్ణయమే తుది నిర్ణయము మరియు కట్టుబడి ఉండదగినది మరియు దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరుపబడవు

23. క్విజ్ లోకి ఎంటర్ కావడం ద్వారా, ప్రవేశకుడు నియమాలు మరియు నిబంధనలను అంగీకరిస్తారు మరియు వీటికి కట్టుబడి ఉంటారు

24. నియమాలు మరియు నిబంధనలు భారతీయ న్యాయవ్యవస్థ చే పాలించబడతాయి

25. అనువదించబడిన సమాచారానికి ఏవైనా సవరణలు అవసరమైతే, దానిని contests@mygov.in కి తెలియజేయవచ్చు మరియు హిందీ/ఇంగ్లీష్ సమాచారాన్ని సూచించాలి.