
భారతదేశపు 12 ఏళ్ల ప్రగతి ప్రస్థానం మరియు వికసిత్ భారత్ సంకల్ప వేడుకల్లో భాగంగా, దేశవ్యాప్త పౌరులందరినీ వికసిత్ భారత్ క్విజ్ 2026 లో పాల్గొనాల్సిందిగా మైగవ్ ఆహ్వానిస్తోంది.
గత 12 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతి మరియు విజయాల గురించి తెలుసుకోవడానికి ఈ ఆకర్షణీయమైన కార్యక్రమం పాల్గొనేవారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, సామాజిక సంక్షేమం, ఆవిష్కరణలు మరియు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే విజన్ వంటి రంగాలలో సాధించిన ముఖ్యమైన అభివృద్ధి పరిణామాలను ఈ క్విజ్ కవర్ చేస్తుంది.
అవగాహనను పెంపొందించడం, పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు మరింత బలిష్టమైన, సమగ్రమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న సామూహిక ప్రయత్నాలను అభినందించడం ఈ క్విజ్ యొక్క లక్ష్యం.
బహుమతి –
క్విజ్ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అగ్రస్థాన విజేతకు ₹51,000/- నగదు బహుమతితో అవార్డు అందజేయబడుతుంది.
రెండవ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతకు ₹31,000/- నగదు బహుమతితో అవార్డు అందజేయబడుతుంది.
మూడవ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతకు ₹21,000/- నగదు బహుమతితో అవార్డు అందజేయబడుతుంది.
ఆ తర్వాతి 50 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ఒక్కొక్కరికి ₹4,000/- చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి.
అదనంగా, ఆ తర్వాతి 100 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ఒక్కొక్కరికి ₹3,000/- చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేయబడతాయి.
పాల్గొనే వారందరికీ డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేయబడుతుంది.
1. క్విజ్ పోటీలో పాల్గొనడానికి భారతీయ పౌరులందరూ అర్హులు.
2. పాల్గొనే వ్యక్తి ‘క్విజ్ ఆడండి’ పై క్లిక్ చేసిన వెంటనే క్విజ్ ప్రారంభమవుతుంది.
3. క్విజ్ నిర్వాహకులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుసంధానించబడిన ఉద్యోగులు ఎవరూ కూడా ఈ క్విజ్ పోటీలో పాల్గొనడానికి అర్హత కలిగి ఉండరు. ఈ అనర్హత వారి తక్షణ కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది.
4. విజేతల జాబితాలో అర్హత పొందడానికి పార్టిసిపెంట్స్ యొక్క మైగవ్ ప్రొఫైల్ అప్‌డేట్ చేయబడి మరియు ఖచ్చితంగా ఉండటం అనివార్యం.
5. ఇది సమయ పరిమితితో కూడిన క్విజ్ పోటీ: పాల్గొనే వారు 10 ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేయడానికి 300 సెకన్ల వ్యవధి ఇవ్వబడుతుంది.
6. ఒకరు ఒకే ఒకసారి మాత్రమే ఈ క్విజ్ పోటీలో పాల్గొనడానికి అనుమతించబడతారు. ఒకే అభ్యర్థి నుండి బహుళ ఎంట్రీలు కనుగొనబడిన యెడల, ఆ పార్టిసిపెంట్‌ను ఈ క్విజ్ పోటీ నుండి అనర్హులుగా ప్రకటిస్తారు.
7. క్విజ్ గెలుపొందడానికి గల ప్రమాణం, 300 సెకన్లలోపు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం.
8. నిష్పాక్షికత మరియు పారదర్శకతను పెంపొందించేందుకు గానూ, విజేతల ఎంపిక కంప్యూటర్ ఆధారిత యాదృచ్ఛిక విధానం ద్వారా నిర్వహించబడుతుంది. నిర్ణీత కాలవ్యవధిలో అన్ని సరైన సమాధానాలను సమర్పించి, పైన పేర్కొన్న క్విజ్ విజేతల అర్హతలను సాధించిన పార్టిసిపెంట్స్ అందరి వివరాలు అర్హత కలిగిన ఎంట్రీల సెంట్రలైజ్డ్ పూల్ నందు పొందుపరచబడతాయి. విజేతలు పూర్తిగా స్వయంచాలిత యాదృచ్ఛిక ఎంపిక విధానం ద్వారా మాత్రమే ఎంపిక చేయబడతారు.
9. పార్టిసిపెంట్స్ ఈ క్విజ్ పోటీ యొక్క అన్ని నిబంధనలు మరియు షరతులకు, అలాగే వాటికి చేయబడే ఏవైనా సవరణలు లేదా తదుపరి మార్పులకు లోబడి ఉండటానికి అంగీకరించవలసి ఉంటుంది.
10. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు, ఒక కుటుంబం నుండి ఒక్కరిని మాత్రమే విన్నర్ షార్ట్‌లిస్ట్‌కు ఎంపిక చేస్తారు.
11. ఈ క్విజ్ పోటీలో పాల్గొనే క్రమంలో వేరొకరి వలె నటించడం, ఒకటి కంటే ఎక్కువసార్లు పాల్గొనడం వంటి వాటితో సహా, ఇతరత్రా ఎలాంటి అక్రమ లేదా నకిలీ మార్గాలను/దుశ్చర్యలను ఉపయోగించినట్లు కనుగొనబడిన యెడల, సదరు అభ్యర్థిత్వం పూర్తిగా రద్దు చేయబడి, తిరస్కరణకు గురవుతుంది. ఈ విషయంలో క్విజ్ నిర్వాహకుల నిర్ణయమే అంతిమం మరియు వారికే పూర్తి హక్కులు ఉంటాయి.
12. విజేతల ఎంపిక ప్రకటన blog.mygov.in నందు చేయబడుతుంది మరియు ఈ ఈవెంట్‌కు సంబంధించిన తదుపరి వివరాలు అధికారిక సమాచారం ద్వారా విజేతలకు చేరవేయబడతాయి. ఊహించని పరిస్థితులు సంభవించిన యెడల, ఈ పోటీ యొక్క నియమ నిబంధనలను ఏ సమయంలోనైనా సవరించడానికి లేదా అవసరమని భావిస్తే పోటీని పూర్తిగా రద్దు చేయడానికి నిర్వాహక సంఘానికి సర్వహక్కులు కలవు.
13. కంప్యూటర్ లోపం లేదా నిర్వాహకుల సహేతుకమైన నియంత్రణకు అతీతమైన ఏదేని ఇతర లోపం కారణంగా, పోగొట్టుకున్న, ఆలస్యమైన, అసంపూర్తిగా ఉన్న లేదా విజయవంతంగా బదిలీ చేయబడని ఎంట్రీలకు నిర్వాహక సంఘం ఎటువంటి బాధ్యతను స్వీకరించదు.
14. ఎంట్రీని సమర్పించినట్లు చూపే నిరూపణ అనేది, సదరు ఎంట్రీ విజయవంతంగా స్వీకరించబడినట్లుగా నిర్ధారించే నిరూపణ కాబోదని దయచేసి గమనించవలెను.
15. అన్ని రకాల వివాదాలు/చట్టపరమైన ఫిర్యాదులు కేవలం ఢిల్లీ ప్రాంతీయ న్యాయపరిధికి మాత్రమే లోబడి ఉండగలవు. ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చులను ఎవరికి వారే స్వయంగా భరించాల్సి ఉంటుంది.
16. ఇక్కడి నుండి పేర్కొనబోవు నియమ నిబంధనలు అన్నీ భారతీయ చట్టాలచే మరియు భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క తీర్పులచే శాసించబడతాయి.